హెయిర్ ప్యాక్స్‌లో పెరుగును ఉపయోగిస్తే ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఇవి జుట్టుకు కుదుళ్లనుంచి పోషణ అందిస్తాయి. ఇవే కాకుండా బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. జుట్టుకు మాయిశ్చరైజర్ కావాలంటే పెరుగులో తేనె, ఆలివ్ నూనెను మిక్స్ చేసి ప్యాక్ వేసుకోవచ్చు. డ్రై హెయిర్ వారు కొబ్బరి నూనె, నిమ్మరసం, పెరుగు కలిపి మాస్క్ వేసుకోవచ్చు. జుట్టు పెరుగుదలకు కలబంద, గుడ్డు, పెరుగు మిక్స్ చేసి పెట్టవచ్చు. జుట్టు రాలకుండా ఉండాలంటే ఆరెంజ్ జ్యూస్, కొబ్బరినూనె, పెరుగు ప్యాక్ వేసుకుంటే మంచిది. హెల్తీ హెయిర్ కోసం యాపిల్ సైడర్ వెనిగర్, ఆముదం, పెరుగు కలిపి ప్యాక్ వేసుకోవచ్చు. అరటిపండు, నిమ్మరసం, పెరుగుతో ప్యాక్ వేసుకుంటే జుట్టు రాలడం తగ్గుతుంది. ఇవి అవగాహన కోసమే. నిపుణులను సంప్రదించి కేర్ తీసుకుంటే మంచిది. (Images Source : Unsplash)