కోస్టారికా 1948లో తన సైన్యాన్ని నిరవధికంగా రద్దు చేసుకుంది. అదే మాటమీద ఇప్పటికీ శాంతియుతంగా వ్యవహరిస్తున్నారు.

ఐస్లాండ్ దేశానికి సైన్యం లేదు. కానీ నాటో సభ్యత్వం ఉంది. యూఎస్ఏతో రక్షణ ఒప్పందాలున్నాయి.

మారిషస్ కు సైన్యం లేదు, కానీ నెషనల్ పోలీస్ ఫోర్స్, నేషనల్ కోస్ట్ గార్డ్స్ రక్షణ బాధ్యతలు నిర్వహిస్తాయి.

పనామా 1989లో తన సైన్యాన్ని రద్దు చేసింది. పనామియన్ పబ్లిక్ ఫోర్సెస్ రక్షణ బాధ్యతలు మానవీయ విలువలతో నిర్వహిస్తుంది.

లీచ్టెన్స్టెయిన్ చిన్న యూరోపియన్ దేశం. వీరికి సైన్యం లేదు. కానీ స్విట్జర్లాండ్ సైన్యం వీరి రక్షణ బాధ్యతలు నిర్వహిస్తుంది.

ఆండోరా చిన్న యూరోపియన్ దేశం. దీనికి పొరుగున ఉన్న ఫ్రాన్స్, స్పెయిన్ దీన్ని రక్షిస్తుంటాయి.

పలావు దేశానికి సంప్రదాయ సైన్యం లేదు. కానీ వీళ్ల రక్షణ బాధ్యతలు యునైటెడ్ స్టేట్స్ చూస్తుంది.

Image Source: Pexels

Images Credit: Pexels