కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు. అందుకే కొందరు వీటిని ఎక్కువగా తీసుకుంటారు.

కానీ పోషకాలతో నిండిన కొబ్బరి నీళ్లను ఎప్పుడు తాగాలి? ఎంత తాగాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కొబ్బరి నీళ్లను రోజుకు 1 లేదా 2 కప్పులు తీసుకుంటే మంచిది. అరలీటర్​ కొబ్బరి నీరు తీసుకోవచ్చు.

శారీరక శ్రమ ఎక్కువగా ఉండేవారు, క్రీడాకారులు 2 నుంచి మూడు కప్పులు తాగవచ్చు.

కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్స్, పొటాషియం, సోడియం, మెగ్నీషియం వంటి పోషకాలు శరీరానికి అందుతాయి.

కొబ్బరి నీళ్లు తాగితే హైడ్రేటెడ్​గా ఉంటారు. షుగర్​తో నిండిన స్పోర్ట్ డ్రింక్స్ కంటే ఇది చాలా మంచిది.

ఇలా కాదని ఎక్కువగా కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకుంటే శరీరంలో ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి.

ఫ్రెష్ కొబ్బరి నీరు తాగితే మంచిది. ఫ్లేవర్స్​తో ఉండేవి, ప్యాక్డ్ కొబ్బరి నీరుకు దూరంగా ఉండండి.

వేడి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు, వ్యాయామం తరువాత కొబ్బరి నీరు తీసుకుంటే మంచిది.

కొబ్బరి నీళ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇవి కిడ్నీ సమస్యలను రెట్టింపు చేస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

సమ్మర్​లో వచ్చే జీర్ణ సమస్యలను దూరం చేసి.. మలబద్ధకం సమస్యలను తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణులు సలహా తీసుకుని డైట్​లో చేర్చుకుంటే మంచిది.