కుండీల్లో బెండకాయలు ఈజీగా పెంచండిలా

Published by: Geddam Vijaya Madhuri

ఈ మధ్యకాలంలో ఇంట్లో కూరగాయలు పెంచే ట్రెండ్ చాలా వేగంగా పెరుగుతోంది.

అయితే బెండకాయలను కూడా కుండీలలో సులభంగా పెంచుకోవచ్చు.

బెండకాయ పెంచడానికి కనీసం 10-12 అంగుళాల లోతు గల కుండీని తీసుకోండి. తద్వారా వేర్లు బాగా పెరుగుతాయి.

కుండీల్లో 50 శాతం మట్టి, 30 శాతం పేడ ఎరువు, 20 శాతం ఇసుక కలిపి నింపండి.

బెండకాయ విత్తనాలను నాటడానికి ముందు 6-8 గంటలు నీటిలో నానబెట్టండి. ఇది మొలకెత్తడాన్ని వేగవంతం చేస్తుంది.

విత్తనాలను 1 అంగుళం లోతులో నాటండి. పైన కొద్దిగా మట్టి వేసి నీరు పెట్టండి.

కుండీని 6-7 గంటల సూర్యరశ్మి తగిలేలా ఉంచండి.

ప్రతిరోజు కొంచెం నీరు పోయండి, కానీ నేలలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోండి.

35-40 రోజుల్లో మొక్కకు బెండకాయలు రావడం ప్రారంభమవుతుంది.