గ్రీన్ చట్నీని ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. సింపుల్ రెసిపీ ఇదే

సమోసాలు, పకోడీలు, చాట్స్​లో, ముఖ్యంగా గ్రిల్డ్ చికెన్లో గ్రీన్ చట్నీ వేసుకుంటే.. వాటి రుచి మరింత పెరుగుతుంది.

అయితే ఈ చట్నీని ఇంట్లో ఎలా చేసుకోవాలో, రెసిపీ ఇప్పుడు చూసేద్దాం.

కప్పు కొత్తిమీర, అరకప్పు పుదీనా, అరకప్పు పచ్చిమిర్చి, ఉల్లిపాయను సిద్ధం చేసుకోవాలి.

వెల్లుల్లి రెబ్బలు 2, అల్లం తురుము అరటీస్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్ అవసరమవుతుంది.

రుచికి తగినంత ఉప్పు, పావు కప్పు నీళ్లు, రెండు టేబుల్ స్పూన్లు యోగర్ట్ తీసుకోవాలి.

బ్లెండర్​లో కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, అల్లం వేసి బ్లెండ్ చేయాలి.

అన్నీ పూర్తిగా కలిసి.. ముక్కలయ్యేలా బ్లెండ్ చేయాలి. దానిలో నిమ్మరసం, ఉప్పు, నీళ్లు వేసి స్మూత్​గా బ్లెండ్ చేసుకోవాలి.

రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. క్రీమిగా కావాలనుకుంటే యోగర్ట్ కూడా వేసి మిక్స్ చేసుకోవాలి.

దీనిని ఎయిర్​టైట్ కంటైనర్​లో పెట్టుకోవాలి. అరగంట ఫ్రిడ్జ్​లో పెట్టుకుని చేసుకోవచ్చు.

మీరు స్నాక్స్ చేసుకున్నప్పుడు దీనిని ఉపయోగించుకోవచ్చు.