అల్లంతో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలున్నాయి. బరువు తగ్గాలనుకునేవారికి కూడా ఇది మంచిది. జీర్ణసమస్యలున్నవారు కూడా దీనిని రెగ్యులర్‌గా తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. ప్రెగ్నెన్సీ సమయంలో, వాంతులు అవుతున్నప్పుడు, కిమో థెరపీ సమయంలో దీనిని తీసుకుంటే వాంతులు ఆగుతాయి. అల్లంలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు నొప్పిని తగ్గించి.. ఉపశమనం అందిస్తాయి. ఆర్థ్రైటిస్ ఉన్నవాళ్లు తాగొచ్చు. పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని దూరం చేసి.. రిలీఫ్‌గా ఉండడంలో హెల్ప్ చేస్తాయి. అల్లంలోని యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచి జలుబు, దగ్గు రాకుండా హెల్ప్ చేస్తాయి. క్యాన్సర్, డయాబెటిస్, గుండె సమస్యలను దూరం చేసే యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. బరువు తగ్గాలనుకునేవారు రోజూ దీనిని తాగితే మంచి ఫలితాలు ఉంటాయి. స్కిన్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఇన్ఫ్లమేషన్, మంట తగ్గి స్కిన్ మంచి గ్లోని ఇస్తుంది. బీపీ ఉన్నవారికి కూడా ఇది మంచిది. రోజూ ఉదయాన్నే తాగడం వల్ల రక్తపోటు కంట్రోల్ అవుతుంది. ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా ఫాలో అయితే మంచి ఫలితాలుంటాయి.