నెయ్యిని చాలామంది ఇళ్లల్లో వంటకోసం వాడుతారు. రెగ్యులర్​గా తింటారు.

అయితే మీకు తెలుసా నెయ్యిని అప్లై చేయడం వల్ల బ్యూటీకి ఎన్నో బెనిఫిట్స్ అందుతాయి.

నెయ్యిని కాస్త తీసుకుని చేతులతో రబ్​ చేసి కాస్త వేడిని క్రియేట్ చేసి.. దానిని చర్మానికి అప్లై చేస్తే చాలా మంచిది.

ఇది శరీరానికి లోపలి నుంచి హైడ్రేషన్​ను అందిస్తుంది. స్కిన్​ను మృదువుగా చేస్తుంది.

సహజంగా చర్మానికి గ్లోని అందించే గుణం నెయ్యికి ఉంది. కాబట్టి దీనిని రెగ్యులర్​గా అప్లై చేయవచ్చు.

నెయ్యిలో పసుపు కలిపి కూడా ముఖానికి ఫేస్​ ప్యాక్ లాగా అప్లై చేసుకోవచ్చు.

ఈ ప్యాక్​ని పావుగంట ఉంచి గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇది చర్మానికి మంచి గ్లోని ఇస్తుంది.

పెదాలు పగిలిపోతుంటే.. రాత్రుళ్లు కాస్త నెయ్యిని అప్లై చేయండి. పగుళ్లు తగ్గడమే కాకుండా సాఫ్ట్​గా మారుతాయి.

డార్క్ సర్కిల్స్ ఉంటే కూడా మీరు పడుకునే ముందు ఆ ప్రాంతంలో నెయ్యి అప్లై చేస్తే ఉదయానికి మంచి ఫలితాలు ఉంటాయి.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు ఫాలో అయితే మంచిది.