గార్లిక్ బ్రెడ్‌ని చాలామంది ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే దీనిని బ్రేక్‌ఫాస్ట్‌గా తినొచ్చా? లేదా?
ఉదయాన్నే గార్లిక్ బ్రెడ్ తింటే ఎనర్జీ వస్తుంది. బ్రెడ్లోని కార్బోహైడ్రేట్స్ మీకు శక్తిని అందిస్తాయి.
ఫుడ్ క్రేవింగ్స్‌ని తగ్గిస్తాయి. కడుపు నిండుగా చేస్తాయి. అలాగే గార్లిక్ మీకు మంచి ఫ్లేవర్ ఇస్తుంది.
పైగా ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ చేసుకోవడానికి టైమ్ ఉండదనుకునేవారికి ఇది టేస్టీ, ఈజీ ఆప్షన్.
అయితే దీనిలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి బరువు పెరిగే అవకాశం ఎక్కువ.
ప్రోటీన్, ఫైబర్, హెల్తీ ఫ్యాట్స్ ఉండవు. దీనివల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందవు.
వివిధ ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి గార్లిక్ బ్రెడ్ మంచిది కాదు. గ్లూటన్ ఇన్టోలెర్న్స్ ఉంటే మరీ కష్టం.
దీనిని మీరు తీసుకోవాలనుకుంటే.. ఎగ్స్, అవకాడో, ఫ్రెష్ ఫ్రూట్స్ కలిపి తీసుకుంటే బెస్ట్.
వైట్ బ్రెడ్‌కి బదులు మల్టీ గ్రైన్ బ్రెడ్ ఉపయోగిస్తే ఫైబర్ శరీరానికి అందుతుంది.
ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా ఫాలో అయితే మంచి ఫలితాలుంటాయి.