వెల్లుల్లిని పచ్చిగా తినడం ఇష్టం లేకపోతే.. వేయించుకుని తినండి ఆరోగ్యానికి మంచిదే అంటున్నారు నిపుణులు.

వెల్లుల్లిని వేయించుకుని తింటే దాని రుచి పెరగడంతో పాటు.. నట్టీ, టేస్టీ ఫ్లేవర్ మీ సొంతమవుతుంది.

సలాడ్స్, సూప్స్​ వంటి వాటిలో వీటిని వేసుకుని తింటే రుచి మరింత పెరుగుతుంది.

వెల్లుల్లిలోని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కణాలు డ్యామేజ్ కాకుండా హెల్ప్ చేస్తాయి. ఒత్తిడిని తగ్గిస్తాయి.

చెడు కొలెస్ట్రాల్​ను తగ్గించి.. గుండె సమస్యలను దూరం చేసే లక్షణాలు వెల్లుల్లిలో ఉంటాయి.

వెల్లుల్లి రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలు కలిగి ఉంటాయి. జలుబు, ఫ్లూ వంటి లక్షణాలు దూరమవుతాయి.

యాంటీబాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీఫంగల్ లక్షణాలు వివిధ ఆరోగ్య సమస్యలను దూరం చేస్తాయి.

వేయించుకున్న వెల్లుల్లిలోని యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు ఆర్థ్రైటిస్ సమస్యలను తగ్గిస్తాయి.

ఆలివ్ ఆయిల్, అవకాడో ఆయిల్​తో వెల్లుల్లిని వేయించుకుని తింటే గుండె ఆరోగ్యానికి మంచిది.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు ఫాలో అయితే మంచిది.