కాళ్లు ఎక్కువగా లాగుతున్నాయా? కారణాలు ఇవే కావచ్చు

Published by: Geddam Vijaya Madhuri

తగినంత నీరు తాగకపోతే కండరాలు సరిగ్గా పనిచేయక కాళ్లు లాగడం, తిమ్మిర్లు రావడం జరుగుతుంది.

మెగ్నీషియం కండరాల పనితీరుకు కీలకం. దీని లోపం వల్ల కాళ్ల కండరాలు తరచూ పట్టేయవచ్చు.

పొటాషియం లోపం వల్ల కండరాల సంకోచాలు సరిగా జరగక కాళ్లు లాగినట్లు అనిపించవచ్చు.

కాల్షియం ఎముకలకే కాదు, కండరాల పనితీరుకు కూడా అవసరం. లోపం ఉంటే కండరాల నొప్పులు, క్రాంప్స్ రావచ్చు.

ఒకే భంగిమలో ఎక్కువసేపు ఉండటం వల్ల కాళ్లలో రక్తప్రసరణ తగ్గి కండరాలు బిగుసుకుపోవచ్చు.

ఎక్కువగా నడవడం, పరుగెత్తడం లేదా వ్యాయామం చేయడం వల్ల కండరాలపై ఒత్తిడి పెరిగి కాళ్లు లాగవచ్చు.

కాళ్లకు సరైన రక్తప్రసరణ లేకపోతే నొప్పి, తిమ్మిర్లు, లాగినట్లు అనిపించడం జరుగుతుంది.

సయాటికా లేదా ఇతర నరాల సంబంధిత సమస్యల వల్ల కూడా కాళ్లు లాగుతున్నట్లు అనిపించవచ్చు.

గర్భిణీల్లో హార్మోన్ల మార్పులు, ఖనిజాల లోపం, బరువు పెరగడం వల్ల కాళ్ల క్రాంప్స్ సాధారణంగా కనిపిస్తాయి.

మధుమేహం, కిడ్నీ వ్యాధులు, థైరాయిడ్ సమస్యలు లేదా కొన్ని మందుల దుష్ప్రభావాల వల్ల కూడా కాళ్లు తరచూ లాగవచ్చు.