ముఖంలో కనిపించే ఈ లక్షణాలు మెగ్నీషియం లోపానికి సంకేతాలు

Published by: Geddam Vijaya Madhuri

సరైన నిద్ర, పోషకాహారం ఉన్నప్పటికీ కళ్ల కింద నల్లటి వలయాలు కనిపిస్తే మెగ్నీషియం లోపం కావచ్చు.

తరచూ కంటి రెప్పలు లేదా కళ్ల చుట్టూ కండరాలు అనియంత్రితంగా కదలడం మెగ్నీషియం లోపానికి సంకేతం కావచ్చు.

చెంపలు, పెదవులు లేదా దవడ ప్రాంతంలో కండరాలు తిమ్మిర్లు పెట్టడం కూడా దాని లక్షణమే.

మెగ్నీషియం తక్కువగా ఉంటే చర్మం పొడిగా, నిర్జీవంగా కనిపించే అవకాశం ఉంటుంది.

అలసట, శక్తి లోపం కారణంగా ముఖం కాంతి కోల్పోయి నిస్సత్తువగా కనిపించవచ్చు.

శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ పెరగడం వల్ల కొందరిలో మొటిమల సమస్య తీవ్రం కావచ్చు.

తరచూ పెదవులు పొడిబారడం, మూలల్లో పగుళ్లు రావడం పోషక లోపాలతో పాటు మెగ్నీషియం కొరత కూడా ఉండొచ్చు.

ద్రవాల సమతుల్యత దెబ్బతినడం వల్ల కొందరిలో స్వల్పంగా ముఖం ఉబ్బుతుంది.

మెగ్నీషియం నరాల వ్యవస్థకు అవసరం. లోపం ఉంటే ఒత్తిడి, ఆందోళన పెరిగి ముఖ కవళికల్లో కూడా కనిపించవచ్చు.

మెగ్నీషియం లోపం మైగ్రేన్, తలనొప్పులకు దారితీయవచ్చు. దీంతో ముఖం అలసిపోయినట్లు కనిపిస్తుంది.

మెగ్నీషియం కోసం గుమ్మడి గింజలు, బాదం, జీడిపప్పు, పాలకూర వంటి ఆకుకూరలు, అరటిపండ్లు, బీన్స్, పప్పుధాన్యాలు, డార్క్ చాక్లెట్ తీసుకోవచ్చు.