మలబద్ధకాన్ని సత్వరమే దూరం చేసే ఫుడ్స్ ఇవే

మలబద్ధకం సమస్య చాలామందిని ఇబ్బంది పెడుతుంది.

ఈ సమస్య రావడానికి అనేక కారణాలు ఉంటాయి. జాగ్రత్తలు తీసుకోకుంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది.

మలబద్ధకాన్ని దూరం చేసేందుకు కొన్ని ఫుడ్స్ ఉన్నాయి. అవేంటంటే..

యాపిల్స్​లో డైటరీ ఫైబర్ ఉంటుంది. వీటిని రెగ్యూలర్​గా తింటే సమస్య దూరమవుతుంది.

బెర్రీలలో ఫైబర్, విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.

అవిసె గింజలు ఫైబర్​కు పెట్టింది పేరు. ఇవి సమస్యనుంచి త్వరిత ఉపశమనం ఇస్తాయి.

బీన్స్ వంటి పప్పుధాన్యాల్లో ఫైబర్ నిండుగా ఉంటుంది. జీర్ణ సమస్యలు తగ్గుతాయి.

బ్రకోలీలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది గట్ ఆరోగ్యానికి చాలా మంచిది.

క్వినోవా, కివీ వంటి ఫుడ్స్, పీచుతో కూడిన డైటరీ పదార్థాలు కూడా సమస్యని తగ్గిస్తాయి.

ఇవి కేవలం అవగాహన కోసమే. వైద్యుల సలహా పాటిస్తే మంచిది.(Images Source : Envato)