వర్షాకాలంలో జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉంటుంది. దానిని ఎలా బీట్ చేయాలో తెలుసా? అయితే కొన్ని టిప్స్ జుట్టు రాలడం తగ్గడమే కాకుండా.. మంచిగా పెరుగుతుంది. గుడ్లలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. దీనిలో బయోటిన్ కూడా జుట్టు పెరుగుదలను ప్రోత్సాహిస్తుంది. చిలగడదుంపల్లో బీటా కెరోటిన్, విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. వీటిని తీసుకుంటే జుట్టు సమస్యలు తగ్గుతాయి. పాలకూరల్లో విటమిన్ ఏ, సి జుట్టును స్ట్రాంగ్ చేస్తుంది. దీనివల్ల రాలదు. చేపల్లో ఓమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్, ప్రోటీన్ ఉంటాయి. ఇవి స్కాల్ప్‌కి మంచివి. డ్రై ఫ్రూట్స్, నట్స్లలోని విటమిన్స్ ఆరోగ్యానికి, జుట్టుకి కూడా మేలు చేస్తాయి. చికెన్‌లో కూడా ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇవి కెరాటిన్‌ను విడుదల చేస్తాయి. ఉల్లిపాయలు తలలో రక్తప్రసరణ అభివృద్ధి చెందుతుంది. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సాహిస్తుంది. యోగర్ట్, అవకాడో, బెర్రీలలో కూడా జుట్టును గ్రోత్ చేసే లక్షణాలు ఉంటాయి. (Images Source : Envato)