సమ్మర్​లో కొన్ని ఫుడ్స్ బయట ఎక్కువసేపు ఉంచితే అవి కచ్చితంగా పాడైపోతాయి.

అందుకే కొన్ని రకాల ఫుడ్స్​ని ఫ్రిడ్జ్​లో కచ్చితంగా పెట్టాలంటున్నారు. అవేంటో చూసేద్దాం.

పాలు, డెయిరీ ఉత్పత్తులు కచ్చితంగా ఫ్రిడ్జ్​లో పెట్టాలి. పాలు, పెరుగు, చీజ్ వంటివి పాడవకూడదంటే ఇదే బెస్ట్.

గుడ్లు ఫ్రిడ్జ్​లో పెట్టకుంటే చాలాకాలం ఉంటాయి. అయితే సమ్మర్​లో బయట ఉంచితే అవి పాడయ్యే అవకాశం ఎక్కువ.

వండగా మిగిలిన ఆహారం, శాండ్​విచ్​ రాప్స్, సలాడ్స్, ఫ్రూట్ సలాడ్స్ కూడా ఫ్రిడ్జ్​లో పెట్టుకోవాలి.

స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, రాస్ప్​బెర్రీలు, కట్ చేసిన ఫ్రూట్స్, కూరగాయలు కచ్చితంగా ఫ్రిడ్జ్​లో పెట్టేయాలి.

మాంసం, సీ ఫుడ్.. వండేసిన నాన్​వెజ్ కూరలు కూడా ఫ్రిడ్జ్​లో పెట్టకుంటే తర్వగా పాడైపోతాయి.

లెట్యూస్, పాలకూర, కాలే వంటి ఆకుకూరలు, కూరగాయలు.. తులసి, సిలాంత్రో, పార్స్లే వంటి హెర్బ్స్ కచ్చితంగా ఫ్రిడ్జ్​లో పెట్టాలి.

ఫ్రూట్ జ్యూస్, పాలు, ఐస్డ్ టీ, కాఫీలను ఫ్రిడ్జ్​లో పెట్టవచ్చు.