కొన్ని ఆహారపదార్థాలు తరచుగా తీసుకుంటే రొమ్ము క్యాన్సర్ ముప్పు దరిచేరదు.

సాలమన్ వంటి చేపల్లో ఒమెగా3 ఫ్యాటీ ఆసిడ్లు ఎక్కువ. ఇవి యాంటీఇన్ప్లమేటరీ ప్రభావాలు కలిగిఉంటాయి. బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పుతప్పిస్తాయి.

బ్రొకోలిలో సల్ఫోరాఫిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది ట్యూమర్లు పెరగకుండా నివారిస్తుంది.

ఒమెగా3 ఫ్యాటీఆసిడ్లు పుష్కలంగా ఉండే వాల్నట్స్ తో బ్రెస్ట్ క్యాన్సర్ ను నివారిస్తాయి.



స్ట్రాబెర్రీ, బ్లాక్ బెర్రీ వంటి బెర్రీలన్నీంటిలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఆక్సిడెటివ్ ఒత్తిడిని తగ్గించి బ్రెస్ట్ క్యాన్సర్ ను నివారిస్తాయి.

ఆకుకూరల్లో ఫోలెట్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి తరచుగా తీసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ నివారించబడుతుంది.

విటమిన్ C, ఇతర సమ్మేళనాలు కలిగిన సిట్రస్ ఫలాలు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ ను నివారిస్తాయి.

పసుపులో కర్క్యూమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది యాంటీక్యాన్సరస్ లక్షణాలు కలిగి ఉంటుంది. అదనపు కణజాలాల పెరుగుదలను నివారిస్తుంది.



ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే