మెదడును ఆరోగ్యంగా, చురుకుగా ఉంచే ఫుడ్స్ లిస్ట్ ఇదే

Published by: Geddam Vijaya Madhuri

మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. లేదంటే మన జీవనశైలి మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. ఆ సమయంలో మీ డైట్లో కొన్ని ఫుడ్స్ చేర్చుకోవడం వల్ల మెదడుకు సంబంధించిన పోషకాలు అందుతాయి.

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఇతర పోషకాలు మెదడు ఆరోగ్యానికి అవసరం.

హెల్త్‌లైన్ ప్రకారం.. సాల్మన్, సార్డిన్ వంటి చేపలను తినడం మెదడు ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది.

ఇందులో ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి మెదడు కణాలకు అవసరం.

వాల్నట్లలో ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి.

బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీలలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మెదడు కణాలను నష్టం నుంచి రక్షించడంలో సహాయపడతాయి.

గుడ్లలో కోలిన్ ఉంటుంది. ఇది మెదడు పనితీరుకు అవసరమైన పోషకం.

పాలకూర, బ్రోకలీ వంటి ఆకుపచ్చ కూరగాయలు విటమిన్ K, ఇతర పోషకాలను అందిస్తాయి.

డార్క్ చాక్లెట్ కూడా మెదడు ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. వాటిని మీ ఆహారంలో చేర్చుకోండి.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాతో వీటిని డైట్లో చేర్చుకోండి.