శరీరంలో ఐరన్ తగ్గితే రక్తంలో హీమోగ్లోబిన్ స్థాయిలు కూడా తగ్గుతాయి. ఫలితంగా బలహీనత, నీరసం వస్తాయి.

హీమోగ్లోబిన్ స్థాయి తగిన విధంగా ఉంచుకోవడానికి పాలకూర, తోటకూర వంటి ఆకుకూరలు తరచుగా తినాలి.

రెడ్ క్యాప్సికం, ఆరెంజ్, ఉసిరిలో విటమిన్ C ఉంటుంది. ఇది కూడా హీమోగ్లోబిన్ పెంచుతుంది.

చిలగడదుంపల్లో విటమిన్ A ఉంటుంది. ఇది కూడా హీమోగ్లోబిన్ పెరిగేందుకు దోహదం చేస్తుంది.

రాజ్మా , వెరుశెనగ, సన్ఫ్లవర్ గింజల్లో ఫోలేట్ ఉంటుంది. ఇది హీమోగ్లోబిన్ ను పెంచుతుంది.

నిజానికి చిక్కుళ్లలో ప్రోటీన్ ఉంటుంది కనుక హీమోగ్లోబిన్ పెరుగుతుంది.

బీటా కెరొటెనాయిడ్స్ అనే మినరల్ హీమోగ్లోబిన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. ఇది బీట్ రూట్, క్యారెట్, గుమ్మడిలో ఉంటుంది.

చిలగడదుంపలు, గుడ్లు తింటే విటమిన్ A తగినంత అందడం వల్ల హీమోగ్లోబిన్ పెరుగుతుంది.

Image Source: Pexels

ఈ సమాచారం కేవలం అవగాహన కోసమే
ఇలాంటి మరిన్ని స్టోరీల కోసం ఏబిపి దేశం ను సందర్శించండి