Image Source: pexels

మీ పిల్లలు ఎత్తు పెరగాలా? ఈ ఆహారం పెట్టండి

ఎదిగే వయస్సులో పిల్లలకు పోషకాలతో కూడిన మంచి ఆహారం పెట్టడం ఎంతో ముఖ్యం.

పాలు, జున్ను, పెరుగు వంటి ఉత్పత్తుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇవి ఎముకలను బలోపేతం చేస్తాయి.

గుడ్లలో ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. రోజూ పిల్లలకు గుడ్లు తినిపించాలి.

బచ్చలికూర, కాలే, బ్రోకలి వంటి ఆకుకూరలు ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిని తింటే ఎత్తు పెరుగుతారు.

నట్స్, బాదం, వాల్నట్స్, చియాసీడ్స్, అవిసె గింజలు పిల్లలకు రెగ్యులర్ గా ఇవ్వాలి.

వోట్స్, క్వినోవా, బ్రౌన్ రైస్ కూడా మంచివే.

బెర్రీలు, అరటిపండ్లు, నారింజల్లో పిల్లల ఎదుగుదలకు అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.

Image Source: pexels

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.