మీరేం తింటే అదే అవుతారని ఒక నానుడి ఉంది. కాబట్టి ఏం తినకూడదో తెలుసుకోవడం అవసరం.

కచ్చితంగా నిరంతరం జరిగే ప్రక్రియ వయసు పెరగడం. అయితే కొన్ని పదార్థాలు తిన్నపుడు ఇది వేగవంతం అవుతుందట.

సాచ్యూరేటెడ్, ట్రాన్స్ ఫ్యాట్స్ వల్ల శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెరిగిపోవచ్చు. ఫలితంగా చర్మానికి నష్టం జరుగుతుంది.

చక్కెర ఎక్కువగా తినడం వల్ల చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గుతుంది. అందువల్ల చర్మంలో సాగే గుణం తగ్గి త్వరగా ముడతలు పడుతుంది.

వేపుళ్లలో నూనెతో పాటు సోడియం కూడా ఎక్కువే ఉంటుంది. వీటి వల్ల శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెరిగిపోయి చర్మంలో వృద్ధాప్య ఛాయలు వస్తాయి.

కెఫిన్ ఎక్కువగా వినియోగిస్తే డీహైడ్రేషన్ అవుతుంది. దీని వల్ల చర్మం డ్రైగా మారి వయసు మళ్లినట్టు కనిపిస్తుంది.

బేకన్, సాసేజ్ వంటి ప్రాసెస్ చేసిన మాంసాహారం వల్ల అడ్వాన్స్ డ్ గ్లైకేషన్ తో చర్మం వయసు పెరుగుతుంది.

ఆల్కాహాల్ ఎక్కువగా తీసుకునే వారిలో చర్మం డీహైడ్రేట్ అయిపోతుంది. డీహైడ్రేషన్ వల్ల చర్మంలో సన్నని గీతలు, ముడతలు వస్తాయి.

ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే.