Image Source: Pexels

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!

పిల్లల్లో చాలా మందికి ఫాస్ట్ ఫూడ్ అంటే ఇష్టంగా ఉంటుంది. కానీ ఈ ఆహార పదార్థాలు ఆరోగ్యానికి అంత మంచిది కాదు.

ఇన్స్టెంట్ నూడుల్స్ లో సోడియం, రుచిపెంచే ఇతర రసాయనాలు ఉంటాయి. ఇవి పిల్లల ఆరోగ్యాలకు మంచిది కాదు.

బంగాళాదుంపల చిప్స్ రుచిగా ఉంటాయి. కానీ వీటితో గుండె సమస్యలకు కారణమయ్యే సమ్మేళనాలు ఉంటాయి.

ఫ్రెంచ్ ఫ్రైస్ లో హానికర కొవ్వులు, ఎక్కువ మోతాదులో సోడియం ఉంటాయి. ఇవి స్థూలకాయం, గుండె సమస్యలు కలిగిస్తాయి.

హాట్ డగ్స్ వంటి హై ప్రాసెస్డ్ ఫూడ్ తో క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. డయాబెటిస్, గుండె జబ్బులకు కూడా కారణం అవుతుంది.

చికెన్ నగెట్స్ ఈ రోజుల్లో పిల్లలందరూ ఇష్టంగా తింటున్నారు. కానీ ఇవి పిల్లల ఆరోగ్యానికి హాని చేస్తాయి.

బర్గర్లు, పిజ్జాల్లో చాలా కొవ్వులు, క్యాలరీలు, సోడియం ఉంటాయి. ఇవి రక్తంలో కొలెస్ట్రాల్ పెంచుతాయి.

పెస్ట్రీలు, కుకీలు కొలెస్ట్రాల్ ఎక్కువ కలిగి ఉంటాయి. పోషకాలు తక్కువ ఉంటాయి.

క్యాండీలు.. రంగులు, చక్కెరలతో ఆకర్షణీయంగా ఉంటాయి. కానీ వీటివల్ల దంతక్షయం వంటి సమస్యలు వస్తాయి.