ఎత్తు పెరగాలా? ఇవి తింటే సరి చిక్కుళ్లలో ఎత్తు పెరిగేందుకు అవసరమైన పోషకాలు ఉంటాయి. బాదంలలో చాలా విటమిన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి ఎత్తు పెరిగేందుకు సహకరిస్తాయి. పెరుగులో ప్రొబయోటిక్స్, ఇతర పోషకాలు ఉంటాయి. ఇవి ఎముకలు, కండర పుష్టికి అవసరం. కనుక రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాలి. పాలకూర, తోటకూర వంటి ఆకుకూరలు ఆహారాల్లో సూపర్ స్టార్లు. ఇవి ఎముకలు ఆరోగ్యంగా ఎదిగేందుకు అవసరం. క్వినోవా కూడా ఎత్తు పెరగడానికి సహకరిస్తుంది. గుడ్లలో ప్రొటీన్ పుష్కలం. పిల్లలకు ప్రతి రోజూ ఇస్తూ ఉంటే ఎత్తు పెరుగుతారు. ఈ సమాచారం కేవలం అవగాహన కోసమే.