Image Source: pexels

ఎండ నుంచి జుట్టును కాపాడుకోవాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి

చర్మం మాత్రమే కాదు..యూవీ కిరణాలు జుట్టుపై ప్రభావం చూపుతాయి. జుట్టును పొడిగా, పెళుసుగా మార్చుతుంది.

జుట్టు చివర్లు చిట్లీపోయేలా చేస్తుంది. ఎండ నుంచి జుట్టును కాపాడుకునేందుకు ఈ టిప్స్ ఫాలో అవ్వండి.

ఎండలో బయటకు వెళ్లినప్పుడు టోపీ కానీ స్కార్ఫ్ కానీ ధరించాలి. ప్రత్యక్ష సూర్యకాంతి జుట్టుపై పడకుండా అడ్డుకుంటాయి.

ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3గంటల మధ్య యూవీ రేడియేషన్ ఎక్కువగా ఉంటుంది.

ఈ సయమంలో బయటకు వెళ్లకపోవడమే మంచిది. వెళ్లాల్సి వచ్చినా స్కార్ఫ్ ఉండటం మంచిది.

సూర్యరశ్మి పడకుండా ఉండాలంటే జుట్టును బన్ను, జడ లేదా పోనీటైల్ వేసుకోవాలి.

జుట్టును యూవీ కిరణాల నుంచి రక్షించడమే కాకుండా గాలి, రాపిడి వల్ల ఏర్పడే చిక్కుళ్లు తగ్గుతాయి.

వేసవిలో డ్రైయర్స్, స్ట్రెయిట్స్ నెర్ లకు దూరంగా ఉండాలి.

Image Source: pexels

సూర్యరశ్మి నుంచి కోల్పోయిన తేమను తిరిగి నింపడానికి డీప్ కండిషనింగ్ లేదా మాస్క్ , ఆయిల్ ట్రీట్మెంట్ ఉపయోగించండి.