కెరీర్​ పరంగా ఎలాంటి రేంజ్​కి, లేదా స్థాయికి చేరుకోవాలనుకుంటున్నారో ముందే గోల్ సెట్ చేసుకోండి.

SMART టెక్నిక్​ని ఫాలో అవ్వండి. గోల్​ Specificగా, Measurableగా, Achievableగా, Relevantగా, Time-bound సెట్ చేసుకోవాలి.

రోజులో, వారంలో, నెలలో చేయాల్సిన ముఖ్యమైన పనులను ముందే నిర్ణయించుకోవాలి.

పనికి తగ్గట్లు ప్రొడెక్టివ్ టూల్స్​ని మీ వర్క్​లో చేర్చుకోవాలి. రిమైండర్స్​ని పెట్టుకోవాలి.

నో చెప్పడం నేర్చుకోండి. తలకు మించిన భారం, ముఖ్యంగా మీ పనిని ఎఫెక్ట్ చేసే వాటిని చేయకపోవడమే మంచిది.

పర్సనల్ గ్రోత్ కోసం బుక్స్, ఆర్టికల్స్, ఇతర ముఖ్యమైన అంశాలను నేర్చుకోండి.

కొత్త స్కిల్స్​ను నేర్చుకోవడం, వర్క్​షాప్స్, కోర్సులు నేర్చుకుంటే మంచిది.

మిమ్మల్ని పాజిటివ్​గా ముందుకు తీసుకెళ్లేవారితో ఉంటే మెంటల్ హెల్త్ మెరుగవుతుంది.

బాధించే అంశాలను వీలైనంత త్వరగా మరచిపోయి.. చేయాల్సిన పనిపై ఫోకస్ పెట్టండి.

ఇవన్నీ చేయాలంటే హెల్త్ సహకరించాలి. కాబట్టి న్యూ ఇయర్​లో హెల్త్​కోసం ఏదైనా రొటీన్​ని అలవాటు చేసుకోండి.