సమ్మర్​లో ఈ టిప్స్​ ఫాలో అయితే చాలా మంచిది

వేసవిలో వేడి వల్ల స్కిన్ సమస్యలు ఎక్కువగా వస్తాయి.

అయితే కొన్ని చిట్కాలతో ఈ సమస్యలను దూరం చేసుకోవచ్చు.

సన్​స్క్రీన్​ను బయటకు వెళ్లినా, వెళ్లకపోయినా అప్లై చేసుకోవాలని గుర్తించుకోవాలి.

బయటకు వెళ్లాల్సి వస్తే స్కార్ఫ్ కట్టుకోవడంతో పాటు, గొడుగును ఉపయోగించండి.

లైట్ వైట్, ఫుల్ హ్యాండ్స్ ఉన్న దుస్తులు వేసుకుంటే ఎండ ప్రభావం స్కిన్​పై ఎక్కువ ఉండదు.

యూవీ కిరణాలు ఇబ్బందిని తగ్గించుకునేందుకు సన్​గ్లాసెస్​ పెట్టుకుంటే మంచిది.

డీహైడ్రేషన్​ వల్ల స్కిన్​ మారిపోతూ ఉంటుంది. నీటిని ఎక్కువగా తాగుతూ హైడ్రేటెడ్​గా ఉండాలి.

ఇవి కేవలం అవగాహన కోసమే. వైద్యుల సలహా తీసుకుని పాటిస్తే మంచిది. (Images Source : Envato)