ఎండకు కళ్లు మండుతున్నాయా? ఈ టిప్స్ పాటించండి! ఎండ తీవ్రతకు చాలా మందిలో కంటి సమస్యలు ఏర్పడుతాయి. వేడికి కళ్లు పొడిబారడంతో పాటు ఎర్రబడి మండుతాయి. కళ్లు ఎర్రబారితే తరచుగా చన్నీళ్లతో శుభ్రంగా కడగాలి. నిద్రపోయే ముందు తేనె, నువ్వుల నూనె కలిపి కళ్లలో వేసుకుంటే చల్లగా ఉంటాయి. అలోవెరా జ్యూస్ లో దూది ముంచి కళ్ల మీద పెట్టుకుంటే కూల్ అవుతాయి. దోసకాయ ముక్కలను కంటి మీద పెట్టుకుంటే చల్లగా మారుతాయి. ఆలుగడ్డ ముక్కలను కళ్ల మీద పెట్టుకుంటే కళ్ల మంట తగ్గుతుంది. రోజ్ వాటర్, పాలలో దూది ముంచి కంటి రెప్పల మీద ఉంచితే వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com