మీ రోజును అల్పాహారంతో ప్రారంభించండి. మీ శరీరానికి అవసరమైన శక్తిని ఇది అందిస్తుంది. ఇలా ప్రారంభించడం వల్ల అనారోగ్యకరమైన ఆహారాల జోలికి వెళ్లకుండా ఉంటారు.
సమతుల్య ఆహారమనేది.. ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతను అందించడంలో హెల్ప్ చేస్తుంది. కార్బ్స్, ప్రోటీన్, హెల్తీ ఫ్యాట్స్, ఫైబర్ ఉండేలా చూసుకోండి.
శరీరానికి నీటిని రెగ్యులర్గా అందించడం వల్ల ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అంతేకాకుండా బరువును నియంత్రించడంలో ఇది హెల్ప్ చేస్తుంది. అలాగే దీనివల్ల షుగర్ డ్రింక్స్ క్రేవింగ్స్ తగ్గుతాయి.
కాఫీ తాగడానికి బదులుగా లేచి నడవండి. లేదా స్ట్రెచ్ చేయండి. ఇది మీ శరీరాన్ని ఉత్తేజితం చేస్తుంది. మూడ్ను మెరుగుపరుస్తుంది.
స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయడం వల్ల మీ మనసుకు విశ్రాంతి లభిస్తుంది. దీనివల్ల మీరు రియాలటీలో ఉంటారు.
మీ గుండె, ఊపిరితిత్తు, శరీరాన్ని కాపాడుకోవాలనుకుంటే.. మీరు స్మోకింగ్ ఆపేయాల్సి వస్తుంది. ఆపిన కొన్ని నిమిషాల్లోనే మీరు మీ లైఫ్ని రీస్టార్ట్ చేసుకోగలుగుతారు.
నిద్ర అనేది మానసికంగా చురుకుగా.. భావోద్వేగపరంగా.. సమతుల్యంగా.. శారీరకంగా చురుకుగా ఉండడంలో హెల్ప్ చేస్తుంది.
వారంలో కనీసం నాలుగు రోజులు వ్యాయామం చేయండి. దీనివల్ల జీవక్రియ పెరుగుతుంది. భంగిమ మెరుగుపడుతుంది. ఎముకలు బలంగా తయారవుతాయి.
కొద్ది సమయం పాటు బయట ఉండటం వల్ల విటమిన్ డి పెరుగుతుంది. మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది. ఇంట్లోనే ఉండడమే కాకుండా బయటకు వెళ్తూ ఉండండి.