ఫస్ట్ నైట్ జీవితంలో ఒకసారే వచ్చే.. మధురానుభూతి. కాబట్టి, దీన్ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. మన కల్చర్ ప్రకారం.. శోభనం మూడు రాత్రులు జరుగుతుంది. అంటే మీకు చాలా టైమ్ ఉంటుంది. తొందర పడకు సుందర వదనా.. అనేది ఫస్ట్ నైట్‌కు బాగా సూట్ అవుతుంది. తొలి రాత్రి ఏ మాత్రం కంగారు పడకూడదు. ముందుగా ఒకరినొకరిని అర్థం చేసుకోవాలి. తొలిరాత్రే ‘పని’ మొదలుపెట్టేయాలనే టార్గెట్ అస్సలు వద్దు. ఇందుకు వధువు అంగీకారం కూడా అవసరం. కొంతమంది అమ్మాయిలకు మొదటి రాత్రంటే భయం. ఆ బిడియాన్ని దూరం చేయాల్సిన బాధ్యత వరుడిదే. ముందుగా ఒకరినొకరు అర్థం చేసుకొనే ప్రయత్నం చెయ్యండి. బాధ పెట్టే విషయాలు షేర్ చేసుకోవద్దు. అది మూడ్ మొత్తాన్ని నాశనం చేస్తుంది. చివరిగా ఆమె అంగీకారంతోనే కార్యాన్ని స్టార్ట్ చెయ్యండి. సున్నితంగా ప్రక్రియ సాగించాలి. మొదటి రోజే ప్రతాపం చూపొద్దు. మీ ఎనర్జీని మిగతా రోజులకు కూడా సేవ్ చేసుకోండి. అపోహలు, అంచనాలు పెట్టుకుని గదిలోకి వెళ్లొద్దు. స్లో అండ్ స్టడీ విన్ ది రేస్ అనే విషయాన్ని గుర్తుంచుకోండి. పర్శనల్ విషయాలు, లవ్ స్టోరీలు.. గర్ల్‌ఫ్రెండ్స్, బాయ్‌ఫ్రెండ్ వంటివి చర్చిస్తే.. భవిష్యత్తు నరకమే.