మెంతినీరు తాగితే ఎన్నో రకాల ఆరోగ్య, సౌందర్య ప్రయోజనాలు పొందవచ్చట. ఒక స్పూన్ మెంతి గింజలను నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగితే చాలా మంచిదట. జీర్ణ సమస్యలను దూరం చేయడంలో ఇది బాగా హెల్ప్ చేస్తుంది. కడుపు ఉబ్బరం, ఎసిడిటీ, గ్యాస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. మెటబాలీజంను పెంచి.. శరీరంలో వేడిని పుట్టించి బరువును తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు దీనిని రెగ్యూలర్గా తీసుకోవచ్చు. పీరియడ్స్ సమయంలో నొప్పి ఎక్కువగా ఉంటే.. దీనిని కచ్చితంగా తాగండి. జుట్టు, చర్మానికి కూడా మెంతి నీళ్లతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. గమనిక: ఈ వివరాలు అవగాహన కోసమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. (Images Source : Unsplash)