సమ్మర్​లో రెగ్యులర్​గా సోంపు నీటిని తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయని చెప్తున్నారు.

సోంపులో శరీరంలోని వేడిని తగ్గించే లక్షణాలు ఉంటాయి. ఇవి హీట్​ స్ట్రోక్​ని దూరం చేస్తాయి.

జీర్ణ సమస్యలను దూరం చేయడంలో హెల్ప్ చేస్తాయి. కడుపు ఉబ్బరం, ఎసిడిటీ వంటి సమస్యలు తగ్గుతాయి.

దీనిలోని యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు శరీరంలోని వేడిని, మంటను కంట్రోల్ చేస్తాయి.

సోంపును నీటిలో నానబెట్టి ఆ నీటిని తాగడం వల్ల ఎక్కువకాలం హైడ్రేటెడ్​గా ఉంటారు.

శరీరంలోని టాక్సిన్లను సహజంగా డీటాక్స్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. కిడ్నీల ఆరోగ్యానికి మంచిది.

బరువు తగ్గాలనుకునేవారు కూడా దీనిని డైట్​లో తీసుకోవచ్చు. మెటబాలీజంను పెంచి కేలరీలను తగ్గిస్తుంది.

స్కిన్ హెల్త్​ని ప్రమోట్ చేయడంలో యాంటీ ఆక్సిడెంట్లు హెల్ప్ చేస్తాయి. మెరిసే స్కిన్ సొంతమవుతుంది.

ఒత్తిడి, యాంగ్జైటీ సమస్యలను దూరం చేసి.. నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో హెల్ప్ చేస్తుంది.

ఇది కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు ఫాలో అయితే మంచి ఫలితాలు ఉంటాయి.