వేసవిలో దాహంగా ఉండడం ఒకటే కాదు, ఇతర లక్షణాలు కూడా డీహైడ్రేషన్ కు సంకేతాలుగా ఉంటాయట.

అలాంటి కొన్ని లక్షణాల గురించి ఇక్కడ తెలుసుకుందాం .

శరీరంలో నీటి శాతం తగ్గినపుడు శరీరం డీహైడ్రేషన్ కు గురవుతుంది. చర్మం పొడిబారి, బిగుతుగా మారుతుంది.

మూత్ర విజర్జన తగ్గుతుంది. మూత్రం రంగు మారుతుంది, చిక్కగా మారుతుంది.

డీహైడ్రేషన్ వల్ల నోటిలో లాలాజల ఉత్పత్తి తగ్గి నోటి దుర్వాసనకు కారణం అవుతుంది.

డైహైడ్రేషన్ వల్ల కండరాలు పట్టేస్తాయి. పెద్దగా కష్టతరమైన పని చెయ్యకపోయినా మజిల్ క్రాంప్స్ వస్తాయి.

అసాధారణ రీతిలో చాలా నీరసంగా అనిపిస్తుంది. తగినన్ని నీళ్ల తాగనపుడు శరీరంలో శక్తి తగ్గి ఇలా జరుగుతుంది.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే



Thanks for Reading. UP NEXT

ఎండల్లో హాయినిచ్చే దేశీ పానీయాలు ఇవే, మీరూ ట్రై చెయ్యండి

View next story