లివర్ సమస్య అనగానే అంతా ఆల్కహాల్‌నే నిందిస్తారు.

కానీ అంతకు మించి నష్టం చేసే ఆహారాలున్నాయని మీకు తెలుసా?

అదనంగా చక్కెరలు కలిగిన తీపి పదార్థాలు, పానియాలు నాన్ ఆల్కాహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ కు కారణం అవుతాయి.

సంతృప్త కొవ్వులు, మాంసం, కొవ్వు కలిగిన డైరీ ఉత్పత్తుల వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది, ఫ్యాటీ లివర్ కూడా పెరుగుతుంది.

సాఫ్ట్ డ్రింక్స్ లో అదనపు చక్కెరలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఫార్ఫారిక్ ఆసిడ్లు ఉంటాయి. ఇవి లివర్‌ను పాడు చేస్తాయి.

వైట్ బ్రెడ్, వైట్ రైస్ వంటి రిఫైండ్ కార్బోహైడ్రేట్లు ఎక్కువ తీసుకునే వారిలో లివర్ ఆరోగ్యం పాడవుతుంది.

ఫాస్ట్ ఫూడ్ లో చాలా ఎక్కువ మొత్తంలో కొవ్వులు ఉంటాయి. సోడియం కూడా ఎక్కువ. ఇవన్నీ కూడా లివర్ మీద ప్రభావం చూపుతాయి.

ట్రాన్స్ ఫ్యాట్స్ కలిగిన నూనెలు వాడితే లివర్ ఆరోగ్యం చెడిపోతుంది.

Image Source: Pexels

ఈ సమాచారం కేవలం అవగాహన కోసమే!