ప్రేమ తర్వాత పెళ్లి ఉంటుంది కానీ.. పెళ్లి తర్వాత ప్రేమ అనేది ఈ రోజుల్లో కరువైపోతుంది.

అలా ఇద్దరి మధ్య ఎడబాటు రాకుండా దాంపత్య జీవితం ముందుకు వెళ్లాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి.

సింపుల్ గిఫ్ట్స్, లవ్ నట్స్, క్వాలిటీ టైమ్ అనేవి మీ రిలేషన్​లో ప్రధానంగా ఉండాలి.

గిఫ్ట్స్​ ఇస్తే లవ్​ అని కాదు. కానీ మీకు తోచిన చిన్న చిన్న గిఫ్ట్​లను అప్పుడప్పుడైనా ఇస్తూ ఉండాలి.

పొగడ్తలనేవి రిలేషన్​ని మరింత ఎగ్జైటింగ్​గా ఉండేలా చేస్తాయి. మీ మధ్య ప్రేమను పెంచి బంధాన్ని దృఢం చేస్తాయి.

మీ పార్టనర్​కి, రిలేషన్​కి తగినంత గౌరవం, మర్యాద ఇవ్వాలి. మగవారైనా, ఆడవారైనా మీ బంధానికి కృతజ్ఞతతో ఉండాలి.

మీ పార్టనర్​కి నచ్చిన అంశాల గురించి తెలుసుకోండి. వాటి గురించి మాట్లాడుతూ.. వారితో దగ్గరగా గడపండి.

ఫిజికల్ టచ్​ అనేది రిలేషన్​లో కీ రోల్ ప్లే చేస్తుంది. కేవలం లైగింక ఉండడమే ఫిజికల్ టచ్​ కాదని గుర్తించాలి.

చేతులు పట్టుకోవడం, ముద్దు పెట్టుకోవడం, హగ్స్, భుజాలపై తలవాల్చడం వంటివన్ని ఫిజికల్​గా పార్టనర్​కి దగ్గరగా ఉంచుతాయి.

మీ ఎక్స్​పీరియన్స్​లు షేర్ చేసుకోవడం, ఎమోషనల్​ సపోర్ట్ అందివ్వడం కూడా ముఖ్యమే.