చెమట ఎక్కువగా పడుతుందా? ఈ సమస్యలు వస్తాయ్ జాగ్రత్త!

వేసవిలో చెమట పట్టడం మంచిదే. కానీ, అతిగా చెమటపడుతుంటే మాత్రం జాగ్రత్త.

అదేంటీ.. వేసవి అన్నాక చెమట పట్టదా.. వేడి ఎక్కువంటే అతిగా చెమట కారదా అనుకుంటున్నారా?

వేసవిలో చెమట పట్టడం సాధారణమే, కానీ.. దాన్ని రోజంతా అలా ఉంచుకోవడమే డేంజర్.

ఎందుకంటే.. చెమట వల్ల శరీరంపై బ్యాక్టీరియా పెరుగుతుంది. అది చర్మ రోగాలకు దారి తీయొచ్చు.

ఎక్కువ సేపు చెమటతో ఉంటే చెడు బ్యాక్టీరియా వల్ల దుర్వాసన కూడా వస్తుంది.

కాబట్టి, ఎక్కువ సేపు చెమటతో ఉండకుండా.. స్నానం చెయ్యండి.

Images Credit: Pexels