గుడ్డులోని పచ్చసొన తింటే ఆరోగ్యానికి ఎలాంటి లాభాలు, నష్టాలున్నాయో ఇప్పుడు చూసేద్దాం.

గుడ్డులోని పచ్చసొనలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది కండరాలకు మేలు చేస్తుంది.

దీనిలో విటమిన్ ఏ, డి, ఈ, కె మాత్రమే కాకుండా ఇతర పోషకాలు ఉంటాయి. కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ ఉంటుంది.

పచ్చసొనలోని కోలిన్ మెదడులో అభిజ్ఞా పనితీరు, జ్ఞాపకశక్తికి మద్ధతు ఇస్తుంది.

లుటీన్, జియాక్సంతిన్ యాంటీఆక్సిడెంట్లు కంటి ఆరోగ్యానికి హెల్ప్ చేస్తాయి.

ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్​ ట్రైగ్లిజరైడ్​లను తగ్గించడానికి హెల్ప్ చేసి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువగా తీసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగి గుండె సమస్యలు రావొచ్చు.

కొందరికి అలెర్జీలు వచ్చే ప్రమాదముంది. దద్దర్లు, దురద, శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడుతాయి.

తలనొప్పి, కళ్లు తిరగడం, కంటి చూపు మందగించడం వంటి సమస్యలు పెరిగే అవకాశముంది.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.