బల్లులను ఇంటి నుంచి తరిమే చిట్కాలు ఇవే

Published by: Geddam Vijaya Madhuri

బల్లులను తరిమేందుకు ఖరీదైన రసాయనాలు అవసరం లేదు. కేవలం 5-10 రూపాయల చిట్కాలు సరిపోతాయి.

వెల్లుల్లి వాసన కారణంగా బల్లులు దూరంగా పారిపోతాయి. కిటికీలు, తలుపుల దగ్గర వెల్లుల్లి రెబ్బలు ఉంచండి.

ఉల్లిపాయల ఘాటైన వాసన కూడా బల్లులకు నచ్చదు. దాని రసాన్ని మూలల్లో చల్లండి.

గోడలపై చల్లడానికి నీటిలో నిమ్మరసం, కారం కలపండి.

ఆ స్ప్రే ఘాటు, వాసనతో బల్లులు వెంటనే ఇంటి నుంచి బయటకు వెళ్లిపోతాయి.

గుడ్ల వాసనతో బల్లులకు అక్కడ ఏదో పెద్ద జీవి ఉన్నట్లు భ్రమ కలుగుతుంది.

కేవలం గుడ్ల పెంకులు వేయడం వల్ల అవి భయంతో పారిపోతాయి.

కాఫీ పొడిని చిన్న మాత్రలుగా చేసి గోడల మూలలో ఉంచాలి.

ఇవన్నీ సహజమైన, చవకైన చిట్కాలు బల్లులను శాశ్వతంగా ఇంటి నుంచి బయటకు పంపేస్తాయి.