సమ్మర్​లో వచ్చే వివిధ ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవడానికి తులసి ఆకులను రోజూ తీసుకోవచ్చు.

తులసిలో సహజంగా వేడిని తగ్గించే లక్షణాలు ఉంటాయి. సమ్మర్​లో వేడి వల్ల వచ్చే ఇబ్బందులను ఇది దూరం చేస్తుంది.

తులిసితో కూడిన నీరు శరీరంలో ఎలక్ట్రోలైట్​లను పెంచుతుంది. సమ్మర్​కి ఇది బెస్ట్ ఛాయిస్.

దీనిలోని యాంటీఆక్సిడెంట్లు ఇన్​ఫెక్షన్లను దూరం చేయడంలో హెల్ప్ చేస్తాయి. ఇమ్యూనిటీని పెంచుతాయి.

అలెర్జీలు రాకుండా హెల్ప్ చేస్తుంది. స్కిన్ ర్యాష్ రాకుండా యాంటీఆక్సిడెంట్లు పని చేస్తాయి.

సమ్మర్​లో వచ్చే జీర్ణసమస్యలను దూరం చేస్తుంది. కడుపు ఉబ్బరం, సరిగ్గా జీర్ణం కాకపోవడం వంటి సమస్యలు రావు.

దీనిలోని యాంటీఇన్​ఫ్లమేటరీ లక్షణాలు కడుపు తిప్పడం, వాంతులు వంటివి రాకుండా చేస్తుంది.

ఒత్తిడిని దూరం చేస్తుంది. యాంగ్జైటీతో ఇబ్బంది పడేవారు కూడా దీనిని రోజూ తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి.

చేసే పనిపై ఫోకస్ పెరుగుతుంది. మెంటల్ క్లారిటీని మెరుగుపరుస్తుంది.

రోజుకు 5 నుంచి 7 ఆకులను ఉదయాన్నే పచ్చిగా తినేయొచ్చు. లేదా ఇతర ఫుడ్స్​తో కలిపి తినొచ్చు.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా ఫాలో అయితే మంచి ఫలితాలుంటాయి.