రోజుకో దోసకాయ తినండి - ఈ బెనిఫిట్స్ అన్నీ మీ సొంతం దోసకాయలో విటమిన్ A, C, K, పొటాషియం, లుటిన్ తోపాటు ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ప్రతిరోజూ దోసకాయ తింటే బరువు తగ్గాలనుకునేవారికి ఎంతో మేలు చేస్తుంది. ఈజీగా బరువు తగ్గుతారు. దోసకాయలో ఉండే విటమిన్ K.. ఎముకలను బలంగా ఉంచుతుంది. దోసకాయ నిత్యం తినడం వల్ల జుట్టు, చర్మం మెరుస్తుంది. మలబద్దకం సమస్యతో బాధపడుతున్నవారు క్రమం తప్పకుండా దోసకాయ తింటే మంచి ప్రయోజనం ఉంటుంది. దోసకాయ గ్యాస్, అజీర్తి సమస్యను తగ్గిస్తుంది. కడుపును చల్లగా ఉంటుంది. వేసవిలో ప్రతిరోజూ తినవచ్చు. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. మూత్రపిండాలను హెల్తీగా ఉంచడంలో సహాయపడుతుంది. దోసకాయలో స్టెరాల్ అనే మూలకం కొలెస్ట్రాల్ స్థాయిని మెరుగుపరుస్తుంది. అధిక బీపీ, లో బీపీతో బాధపడేవారు దోసకాయను క్రమం తప్పకుండా తింటే రక్తపోటు అదుపులో ఉంటుంది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.