ఈ మధ్య కాలంలో చాలా మంది జుట్టు సమస్యలు ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. విటమిన్ E ఒకముఖ్యమైన యాంటీఆక్సిడెంట్ పోషకం, జుట్టు ఆరోగ్యంలో కీలకపాత్ర పోషిస్తుంది. విటమిన్ E లోపం వల్ల బొల్లి, సోరియాసిస్, అటోపిక్ డెర్మటైటిస్, మొటిమలు ఏర్పడుతుంటాయి. ఆరోగ్యకరమైన జట్టును ప్రోత్సహించడానికి మన ఆహారంలో విటమిన్ E ఉండేలా చూసుకోవాలి. బాదంలో విటమిన్ E, మెగ్నిషియం, జింక్ ఉంటుంది. జట్టు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వేరుశెనగల్లో జింక్, బయోటిన్, పొటాషియం ఉంటుంది. ఇవి జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తాయి. అవకాడోలో విటమిన్ E, విటమిన్ K, పొటాషియం స్కాల్ప్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. కాలే, కొల్లార్డ్స్ గ్రీన్స్, ఆకుకూరల్లో విటమిన్ E, ఐరన్ పుష్కలంగా ఉంటుంది. జుట్టు రాలుటను నివారిస్తాయి. నువ్వులు, ద్రాక్ష, పొద్దుతిరుగుడు నూనెలో విటమిన్ E ఉంటుంది. ఈనూనె ఆహారంలో చేర్చుకుంటే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.