కొలెస్ట్రాల్, షుగర్​ని కంట్రోల్ చేసేందుకు వెల్లుల్లిని ఇలా తీసుకోండి

వెల్లుల్లితో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

ముఖ్యంగా కొలెస్ట్రాల్, మధుమేహంతో ఇబ్బంది పడేవారు దీనిని తమ డైట్​లో తీసుకోవచ్చు.

ఉదయాన్నే పరగడుపున వెల్లుల్లిని తీసుకోవచ్చు.

లేదంటే వెల్లుల్లితో టీ చేసుకోవచ్చు. దానిలో దాల్చిన చెక్కపొడి వేసుకుంటే మంచిది.

వెల్లుల్లిని నేరుగా తినలేకపోతే తేనెతో కలిపి తీసుకోవచ్చు.

వెల్లుల్లిని రోస్ట్ చేసుకుంటే అవి మరింత సాఫ్ట్​గా, టేస్టీగా మారుతాయి.

మీ వంటల్లో గార్లిక్​ని చేర్చుకుంటే ప్రత్యేకంగా తీసుకోవాల్సిన అవసరం ఉండదు.

వంట చేసుకోవడానికి గార్లిక్ నూనెను కూడా ఉపయోగిస్తే మంచి ఫలితాలుంటాయి.

ఇవి కేవలం అవగాహన కోసమే. వైద్యులను సంప్రదిస్తే మంచిది. (Images Source : Envato)