యాలకుల మొక్కను ఈజీగా పెంచగలిగే టిప్స్

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

యాలకులను ఇండియాలో బాగా ఉపయోగిస్తారు. ఇది ఆహారాన్ని చాలా రుచికరంగా, సువాసన వచ్చేలా చేస్తుంది.

Image Source: pexels

మంచి యాలకుల మొక్కలను పెంచడానికి ఎల్లప్పుడూ ఉత్తమమైన విత్తనాలను ఎంచుకోండి.

Image Source: pexels

కుండీలో నాటడానికి ముందు విత్తనాలను 24 గంటల పాటు నీటిలో నానబెట్టండి.

Image Source: pexels

కుండీ ఆకారం దాదాపు 10 నుంచి 12 అంగుళాల లోతు ఉండాలి. దిగువన నీరు పోయేందుకు రంధ్రం కూడా తప్పనిసరిగా ఉండాలి.

Image Source: pexels

దీని పెరుగుదల కోసం 50% తోట మట్టి 30% పేడ ఎరువు, 20% ఇసుక మిశ్రమం చాలా అనుకూలంగా ఉంటుంది.

Image Source: pexels

విత్తనాలను నేలలో దాదాపు 1 అంగుళం లోతులో ఉంచండి. విత్తనాలను చాలా లోతుగా నాటడం వలన మొలకెత్తడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు.

Image Source: pexels

దీనిని నేరుగా, తీవ్రమైన సూర్యరశ్మి నుంచి రక్షించుకోవాలి. తేలికపాటి సూర్యరశ్మి వచ్చే ప్రదేశంలో ఉంచండి.

Image Source: pexels

నేలలో ఎల్లప్పుడూ తేమను ఉండేలా చూసుకోండి. అలా అని బురదగా చేయవద్దు.

Image Source: pexels

విత్తనం నుంచి మొక్క రావడానికి 20 నుంచి 40 రోజులు పట్టవచ్చు.

Image Source: pexels