పిల్లలు డ్రై ఐ సిండ్రోమ్ తో బాధపడుతున్నారా? ఈ టిప్స్ పాటించండి! పిల్లలు ఎక్కువ సేపు ఫోన్, టీవీ చూడటం వల్ల డ్రై ఐ సమస్య ఏర్పడుతుంది. కాలుష్యం, పొడి, చలి గాలులు కళ్ల నుంచి తేమను తొలగించి డ్రై ఐకి కారణం అవుతాయి. ఒక్కోసారి అలెర్జీల కారణంగా కళ్లు పొడిబారుతాయి. పోషకాహార లోపం, తగినంత నీరు తాగకపోవడం వల్ల కళ్లు పొడిబారుతాయి. అలోవెరా జ్యూస్ లోని యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు కళ్లకు తేమను అందిస్తాయి. కీరదోస ముక్కలను కళ్ల మీద పెట్టుకోవడం వల్ల డ్రై ఐ సమస్య తగ్గుతుంది. పిల్లలు ఫోన్, టీవీని వీలైనంత తక్కువగా చూసేలా జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలు రోజూ తగినంత నీరు తాగేలా చూసుకోవాలి. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com