వర్షాకాలంలో ఈ కూరగాయలను అస్సలు తీసుకోకూడదు.. ఎందుకంటే? వర్షకాలంలో సీజనల్ వ్యాధుల ముప్పు పెరుగుతుంది. వానాకాలంలో కొన్ని రకాల వెజిటెబుల్స్ తో ఆరోగ్య సమస్యలు వస్తాయి. పాలకూర, బచ్చలికూరల లాంటి ఆకుకూరలలో బాక్టీరియా, ఫంగస్ పెరిగి వ్యాధులకు కారణం అవుతాయి. కాలీఫ్లవర్, క్యాబేజీలో పోషకాలు ఎక్కువగా ఉన్నా, వర్షాకాలంలో అనారోగ్య సమస్యలు కలుగుతాయి. వంకాయ, టమాట, బెండ కాయల మీద కూడా సూక్ష్మజీవుల పెరుగుదలకు అనుకూలంగా ఉంటాయి. భూమిలో ఉండే ఆలుగడ్డలు వానాకాలంలో వైరస్ స్థావరాలుగా మారి అనారోగ్యానికి కారణం అవుతాయి. పోషకాల గనిగా చెప్పుకునే పుట్టగొడుగులను వర్షాకాలంలో తినడం వల్ల జీర్ణ సమస్యలు ఏర్పడుతాయి. గ్రీన్ పీస్ లో బోలెడు పోషకాలున్నా, వర్షాకాలంలో అపరిశుభ్రత కారణంగా ఆరోగ్య సమస్యలు వస్తాయి. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com