నిలబడి నీళ్లు తాగుతున్నారా? అయితే.. ఇకపై మానుకోండి! నీళ్లు తాగడమే కాదు, ఎలా తాగుతున్నాం అనేది కూడా ముఖ్యమే! ముఖ్యంగా నిలబడి నీళ్లు తాగితే చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. నిలబడి తాగిన నీరు ఒక్కసారిగా జీర్ణాశయంలోకి వెళ్లి పలు జీర్ణ సమస్యలకు కారణం అవుతాయి. కిడ్నీలకు నీరు సరిగా అందక మూత్రాశయ సమస్యలు, ఇన్ఫెక్షన్లు ఏర్పడుతాయి. నిలబడి నీరు తాగడం వల్ల నీటిని మూత్రపిండాలు సరిగా ఫిల్టర్ చేయలేవు. దీంతో వ్యర్థ పదార్ధాలు నేరుగా మూత్రపిండాలలోకి వెళ్లి రక్తంతో కలుస్తాయి. నిలబడి నీరు తాగడం వల్ల నాడీ వ్యవస్థ కూడా పలు ఇబ్బందులకు గురవుతుంది. ద్రవాల సమతుల్యత దెబ్బతిని, కీళ్ళల్లో ఎక్కువ ద్రవాలు చేరి ఆర్థరైటీస్, కీళ్ళవాతం వస్తుంది. చక్కగా కూర్చొని నెమ్మదిగా సిప్ చేస్తూ నీటిని తాగడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. All Photo Credit: Pixabay.com