దానిమ్మ ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు.

కానీ దానిమ్మ ఆకులతో కూడా ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చని తెలుసా?

దానిమ్మ ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి.

ఇమ్యూనిటీని పెంచుకోవడంలో.. జలుబు, దగ్గును దూరం చేసుకోవడంలో ఇవి హెల్ప్ చేస్తాయి.

నిద్ర సమస్యలుంటే.. 3 గ్రాముల దానిమ్మ ఆకులను కప్పు నీటిలో మరిగించి తాగాలి.

ఎక్జిమా సమస్యలున్నవారు కూడా దానిమ్మ ఆకులతో మంచి ఫలితాలు పొందవచ్చు.

దానిమ్మ ఆకులను పేస్ట్ చేసి.. వాటిని మొటిమలపై అప్లై చేస్తే త్వరగా తగ్గుతాయి.

కడుపు నొప్పిగా ఉన్నప్పుడు దానిమ్మ ఆకుల కషాయం తాగితే రిలీఫ్​గా ఉంటుంది.

గమనిక: ఈ వివరాలు అవగాహన కోసమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. (Images Source : Unsplash)