వేసవిలో సన్ స్క్రీన్‌ లోషన్‌తో ఎన్నో ప్రయోజనాలు!

సూర్యుని నుంచి వచ్చే కిరణాల నుంచి స్కిన్‌ని కాపాడుకునేందుకు సన్ స్క్రీన్ లోషన్లు రాస్తూ ఉంటాం.

సన్ స్క్రీన్ అప్లై చేయడం వల్ల హానికర సూర్య కిరణాలు చర్మం లోపలికి వెళ్లి ఇబ్బంది కలిగించవు.

సన్ స్క్రీన్ రాసుకోవడం వల్ల చర్మం ముడతలు లేకుండా, ఎప్పుడూ యవ్వనంగా కనిపిస్తుంది.

సన్ స్క్రీన్ ట్యానింగ్ కలుగకుండా కాపాడుతుంది.

సన్ స్క్రీన్‌ని ప్రతి రెండు గంటలకి ఒకసారి అప్లై చేయడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

ఎలర్జీలు, సున్నిత చర్మం ఉన్నవారు ఆల్కహాల్ కలిగిన లోషన్లు వాడకపోవడం ఉత్తమం.

డాక్టర్ల సలహా మేరకు చర్మానికి అనుకూలమైన సన్‌స్క్రీన్ లోషన్లు వాడటం ఉత్తమం.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit:Pixels.com