వేసవిలో సోడా ఎక్కువగా తాగుతున్నారా? అయితే, జాగ్రత్త!

వేసవిలో చాలా మంది ఎండ తాపాన్ని తట్టుకునేందుకు సోడా తాగుతారు.

మరికొంత మంది ఫుడ్ చక్కగా జీర్ణం అయ్యేందుకు సోడా తీసుకుంటారు.

కానీ, సోడా ఎక్కువగా తాగితే ముప్పు తప్పదంటున్నారు నిపుణులు.

సోడాలోని ప్రిజర్వేటివ్ సోడియం బెజోయిట్ లంగ్స్ పనితీరుపై తీవ్ర ప్రభావాన్నిచూపిస్తుంది.

సోడా తాగడం వల్ల ఆస్తమా సమస్య ఏర్పడే అవకాశం ఉంటుంది.

సోడాలోని ఫాస్పోరిక్ యాసిడ్ శరీరంలో కాల్షియంను తగ్గించి ఎముకలను బలహీనం చేస్తుంది.

డైట్ సోడాలోని ఆర్టిఫిషియల్ స్వీట్నర్ బరువు పెరిగేలా చేస్తుంది.

గుండెపోటు సహా పలు రకాల క్యాన్సర్ల బారిన పడే అవకాశం ఉంటుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com