పిల్లలకు నిద్రపోయే ముందు పాలు ఇస్తున్నారా? ఈ సమస్యలు తప్పవు

పిల్లలు ఆరోగ్యంగా ఉంటారనే ఉద్దేశంతో చాలామంది వారికి రాత్రివేళ పాలు ఇస్తుంటారు.

అయితే, దాని వల్ల పిల్లలకు లాభం చేయకపోగా ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు.

పడుకొనేప్పుడు పిల్లలకు పాలు ఇవ్వడం ఆరోగ్యకరం కాదు.

రాత్రి వేళ పాలు తాగించడం వల్ల రోగ నిరోధక శక్తి తగ్గుందని వైద్యులు చెబుతున్నారు.

పిల్లలకు ఇమ్యునిటీ పెరగాలంటే త్వరగా వారికి డిన్నర్ పెట్టాలని సూచిస్తున్నారు.

ముఖ్యంగా రాత్రి 7 గంటలకే పిల్లలకు భోజనం పెట్టడం వల్ల మేలు జరుగుతుంది.

పిల్లలకు ఉదయం వేళ పాలు ఇవ్వడమే శ్రేయస్కరమని వైద్యులు సూచిస్తున్నారు.

అలాగే రాత్రి వేళ మజ్జిగ, పెరుగు ఇవ్వడం కూడా మంచిది కాదని అంటున్నారు.

నోట్: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. సందేహాలుంటే వైద్యులను సంప్రదించండి.