వర్షాకాలంలో హెల్తీగా ఉండాలంటే ఈ హెర్బల్ టీలు తాగండి! వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నుంచి కాపాడుకోవాలంటే కొన్ని హెర్బల్ టీలు తీసుకోవాలి. పిప్పరమింట్ టీ అనే సుగంధ పానీయం రోగ నిరోధక శక్తిని పెంచి, ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది. కాశ్మీరీ కహ్వా టీలోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్లూ, జలుబు, దగ్గునుతగ్గిస్తాయి. అల్లం టీలోని యాంటీ ఆక్సిడెంట్లు శ్వాస సంబంధ సమస్యలను తగ్గిస్తాయి. గ్రీన్ టీలోని యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. తులసి, పుదీనా టీలోని ఔషధ గుణాలు సీజనల్ వ్యాధులను అడ్డుకుంటాయి. చమేలీ టీలోని యాంటీ ఆక్సిడెంట్లు జలుబు, దగ్గు, జ్వరం నుంచి కాపాడుతాయి. సోంపు టీ జీర్ణ వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు బాడీని ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com