సమ్మర్​లో మేకప్ కంటే స్కిన్​ కేర్ మంచిదని చెప్తున్నారు నిపుణులు.

ఎండ తీవ్రత వల్ల మేకప్​ లుక్​ కంటే ఇరిటేషన్​ని పెంచే ఆస్కారం ఉంది.

అలాగే ఎండవల్ల పట్టే చెమట మేకప్​ లుక్​ని మరింత వరస్ట్​గా మార్చవచ్చు.

వేడివల్ల వచ్చే పింపుల్స్​పై మేకప్​ ప్రొడెక్ట్స్ అప్లై చేస్తే అవి మరింత ఎక్కువైపోతాయి.

స్కిన్ ఇరిటేషన్, రెడ్​నెస్, ర్యాష్ వంటి సమస్యలు పెరుగుతాయి కాబట్టి మేకప్​ జోలికి వెళ్లకపోవడమే మంచిది.

దానికి బదులుగా స్కిన్​ వరస్ట్ కాకుండా స్కిన్​ కేర్ ప్రొడెక్ట్స్ ఉపయోగించవచ్చు.

క్లెన్సర్, టోనర్, మాయిశ్చరైజర్, సన్​స్క్రీన్ రొటీన్ ఫాలో అయితే స్కిన్​ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది.

ఎండ నుంచి సన్​స్క్రీన్ చర్మాన్ని కాపాడుతుంది. టాన్​ సమస్యలు రాకుండా చేస్తుంది.

ఒకవేళ మేకప్ వేసుకోవాల్సిన పరిస్థితి వస్తే లైట్​గా మేకప్​ వేసుకోండి.

రాత్రుళ్లు పడుకునేముందు మేకప్​ను పూర్తిగా తీసిన తర్వాతే పడుకోండి.