ఈ ఫుడ్స్ని రిహీట్ చేసి తింటే.. ఫుడ్ పాయిజన్ అవుతుంది చాలామంది ఫుడ్స్ వేడిగా ఉంటే తినడానికి ఇష్టపడతారు. కొన్నిసార్లు ఫుడ్ చల్లారిపోతే.. దానిని వేడి చేసుకుని తింటూ ఉంటారు. అయితే కొన్నిఫుడ్స్ రీహీట్ చేయకూడదని అంటున్నారు నిపుణులు. చల్లారిపోయిన అన్నాన్ని వేడి చేసి తినకూడదని సూచిస్తున్నారు. గుడ్లలో ప్రోటీన్ ఉంటుంది. రీహీట్ చేసినప్పుడు ప్రోటీన్ నైట్రోజన్ ఆక్సిడైజ్గా మారిపోతుంది. బంగాళదుంపలను మళ్లీ హీట్ చేస్తే అది ఫుడ్ పాయిజన్కి కారణమయ్యే బ్యాక్టీరియాను విడుదల చేస్తుంది. మష్రూమ్స్ని ఎప్పుడూ రిహీట్ చేయకూడదు. అలా చేస్తే అవి టాక్సిన్స్గా మారిపోతాయి. ఇవి అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది. (Images Source : Getty)